ఎన్టీఆర్ సినిమా విషయంలో ఆ వార్త నిజం కాదట !

ఎన్టీఆర్ సినిమా విషయంలో ఆ వార్త నిజం కాదట !

Published on Jan 19, 2018 4:56 PM IST

ఎన్టీఆర్ తదుపరి చిత్రం కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో జతకట్టబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం స్లిమ్ అవ్వడమే కాకుండా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాకు మొదట అనిరుద్ సంగీతం అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. కాని ఈ మద్య దేవి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడని వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తల్లో నిజం లేదు. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను త్వరలో ఫైనల్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. జై లవ కుశ సినిమా తరువాత ఎన్టీఆర్ చెయ్యబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు