జూన్ నెలాఖరున రానున్న ‘తేజ్ ఐ లవ్ యు’ !

జూన్ నెలాఖరున రానున్న ‘తేజ్ ఐ లవ్ యు’ !

Published on May 23, 2018 4:17 PM IST

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తేజ్ ఐ లవ్ యు’. ప్రామిసింగ్ టీజర్ తో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ చిత్రంపై తేజ్ భారీ ఆశలే పెట్టుకుని ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు ‘తొలిప్రేమ’ లాంటి హిట్టిచ్చిన దర్శకుడు కరుణాకరన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో మెగా అభిమానుల్లో సినిమాపై ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది ఉంది.

ఇటీవలే షూట్ మొత్తం ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ర్టీ ప్రొడక్షన్ దశలో ఉంది. నిర్మాతలు చిత్రాన్ని జూన్ 29న విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు