“సలార్”కు అప్పుడే కళ్ళు చెదిరే డీల్స్ వస్తున్నాయా.?

“సలార్”కు అప్పుడే కళ్ళు చెదిరే డీల్స్ వస్తున్నాయా.?

Published on Mar 3, 2021 4:04 PM IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న బిగ్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి బయటకు వస్తున్న ఒక్కో డీటెయిల్ వరకు కూడా అంచనాలు ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తున్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ భారీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అప్పుడే ఈ సినిమాకు గాను స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో కళ్ళు చెదిరే ఫిగర్స్ తో ఆఫర్స్ వస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు వంద కోట్లకు పైగానే ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని గాసిప్పులు మొదలయ్యాయి.

అయితే దీనికి ముందు ఇదే దర్శకుడు మరియు హోంబలే నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ ఇండియన్ హిట్స్ లో ఒకటైన “కేజీయఫ్” రెండు పార్టులు హక్కులు వీరే ఎంత ధర పెట్టి కొని ఆ హైప్ ను ఎలా తెచ్చుకున్నారో తెలిసిందే. మరి అలా “సలార్” కూడా జరగదా అంటే అందుకు ఛాన్స్ లేదని కూడా చెప్పలేము. ప్రస్తుతానికి అయితే ఈ టాక్ నడుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు