నాగ్ ‘బంగార్రాజు’ పై లేటెస్ట్ అప్ డేట్ !

నాగ్ ‘బంగార్రాజు’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Sep 20, 2020 9:06 PM IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కాంబినేషన్ లో ఆ సినిమాకి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 16వ తేదీ నుండి ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. కాగా ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నాడట. ఇప్పటికే మూడు ట్యూన్స్ పూర్తయ్యాయట. మొత్తానికి ‘బంగార్రాజు’ రాక ఆలస్యం అయినా, ఆసక్తి ఉండేలా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు