‘శ్యామ్ సింగ రాయ్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

‘శ్యామ్ సింగ రాయ్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Sep 27, 2020 10:59 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. కాగా ఈ సినిమా సెకెండ్ హాఫ్ మొత్తం ఒక పురాతనమైన కోటలోనే ఎక్కువ భాగం నడుస్తోందని.. ముఖ్యంగా నాని రోల్ కి సంబంధించిన కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాల బాగుంటాయని… అందుకే నాని ఈ సినిమా పై బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి నాని 27వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్ అండ్ మిగిలిన నటీనటుల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. నాని ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు