Like us on Facebook
 
త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాపై కసరత్తు మొదలైంది !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో జతకట్టబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ లు చేస్తున్న చిత్రాలు కంప్లీట్ కాగానే వీరి కాంబినేషన్ లోని చిత్రం మొదలు కానుంది.

తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్ లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు కలసి కథ గురించి చర్చలు జరిపారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్లు సమాచారం. ఈ ఆసక్తికర కాంబినేషన్ గురించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

Bookmark and Share