లారెన్స్ ‘ముని-4’ వచ్చేది అప్పుడే ?

లారెన్స్ ‘ముని-4’ వచ్చేది అప్పుడే ?

Published on Dec 12, 2017 3:52 PM IST

రాఘవ లారెన్స్ డాన్సర్ తో పాటు మంచి నటుడు, దర్శకుడు కూడ. ఆయన దర్శకత్వం వహించి, నటించిన ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. తాజాగా ‘ముని 4’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు లారెన్స్. హార్రర్‌ కామెడీతో రూపోందిన ‘ముని’ సిరీస్‌లోని మూడు సినిమాలు ప్రేక్షకులను నవ్వించాయి, భయపెట్టాయి.

ఒక రకంగా చెప్పాలంటే హార్రర్‌ కామెడీ జానర్లో ఈ సినిమాలు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘ముని -4’ సినిమాను ఏప్రిల్ 6 న విడుదల చెయ్యడానికి లారెన్స్ సన్నాహాలు చేస్తున్నాడు. దర్శకత్వం చేస్తూనే సినిమాలకు కొరియోగ్రఫీ అందించే లారెన్స్ చిరంజీవి ‘సైరా నరసింహ రెడ్డి’ సినిమాకు సాంగ్ కంపోజ్ చెయ్యబోతుండడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు