రాఘవ లారెన్స్ కొత్త సినిమా మొదలైంది..!

రాఘవ లారెన్స్ కొత్త సినిమా మొదలైంది..!

Published on Aug 3, 2015 12:40 PM IST

raghava-lawrence
నృత్య దర్శకత్వం నుంచి నేరుగా సినిమా దర్శకత్వానికి షిఫ్ట్ అయిన రాఘవ లారెన్స్ దర్శకుడిగానూ మంచి విజయాలను నమోదు చేశారు. ముఖ్యంగా హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘ముని’ సిరీస్‌లోని మూడు సినిమాలూ ఘన విజయం సాధించి దర్శకుడిగా లారెన్స్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ సిరీస్‌లో వేసవి కాణుకగా వచ్చిన ‘కాంచన 2’ తమిళనాట ప్రభంజనమే సృష్టించింది. ఇక ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాఘవ లారెన్స్ రెండు వరుస సినిమాలకు కమిటయ్యారు.

నిజానికి ‘కాంచన 2’ విజయం తర్వాత లారెన్స్.. సూపర్ స్టార్ రజనీ కాంత్, నాగార్జున, సూర్య ఇలా పెద్ద హీరోలను సంప్రదించారు. కాగా తాజాగా ఆయన మళ్ళీ ‘ముని’ సిరీస్‌నే మొదలుపెట్టడం విశేషంగా కనిపిస్తోంది. వెందార్ మూవీస్ సంస్థతో కలిసి రాఘవ లారెన్స్ రెండు సినిమాలకు సైన్ చేశారు. ‘మొట్టశివ కెట్ట శివ’ పేరుతో తెరకెక్కనున్న ఓ సినిమాను ఈ ఉదయమే లాంచ్ చేశారు. ఇక ‘కాంచన 3’ పేరుతో మరో సినిమా కూడా ఇదే క్రమంలో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాల్లో తమిళ టాప్ హీరో నటించనున్నారని సమాచారం. ఇక ‘కాంచన 2’లో పాపులర్ అయిన ‘మొండి శివ గుండు శివ’ (తమిళంలో మొట్టశివ కెట్ట శివ) అన్న డైలాగ్ లారెన్స్ తన కొత్త సినిమాకు పెట్టడం ఆసక్తికరంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు