‘కాంచన 2’ సినిమాకు మంచి రెస్పాన్స్!

‘కాంచన 2’ సినిమాకు మంచి రెస్పాన్స్!

Published on Apr 18, 2015 9:15 AM IST

kanchana-2
హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘కాంచన’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ‘ముని’ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంచన’ తెరకెక్కగా, ఇప్పుడా సిరీస్‌లో మూడో సినిమా ‘గంగ(ముని 3)’ విడుదలకు సిద్ధమైంది. గంగ తమిళ వర్షన్ ‘కాంచన 2’ నిన్నే విడుదలైంది. కొన్ని అనివార్య కారణాలతో తెలుగులో విడుదల కాలేదు. ఈ వారమే తెలుగులోనూ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

నృత్య దర్శకత్వం నుంచి నేరుగా సినిమా దర్శకత్వానికి షిఫ్ట్ అయిన రాఘవ లారెన్స్ దర్శకుడిగానూ మంచి విజయాలను నమోదు చేశారు. ఆయన కెరీర్లో ‘కాంచన’, ‘ముని’ సినిమాలు గుర్తుంచుకోదగ్గ సినిమాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడీ సిరీస్‌లోని ‘కాంచన 2’ సినిమా ద్వారా మరోసారి ఆకట్టుకున్నాడనే టాక్ వినబడుతోంది. తమిళనాట ఈ సినిమాకు మంచి టాక్ లభించింది. లారెన్స్, తాప్సీల నటన సినిమాకు ప్లస్‌పాయింట్‌గా వినిపిస్తోంది. నిత్యామీనన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసి ఆకట్టుకుంది. తెలుగులో ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు