131 గుండె ఆపరేషన్లు చేయించిన డైరెక్టర్!

lawrence
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి దర్శకులుగా మారిన వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన తన సినిమాలతో అలరించడం అటుంచితే, వ్యక్తిగతంగా సమాజం కోసం లారెన్స్ చేసే ఎన్నో పనులు ఆయనకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. సినిమాల ద్వారా తాను సంపాదించే డబ్బులో చాలా మొత్తాన్ని సమాజం కోసమే ఉపయోగించే లారెన్స్‌, అనారోగ్యం బారిన పడిన చిన్న పిల్లల వైద్యంకి అయ్యే ఖర్చంతా భరించి ఎంతో మందికి అండగా నిలిచారు.

తాజాగా ప్రతీక అనే రెండేళ్ళ చిన్నారికి విజయవంతంగా లారెన్స్ సంస్థ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసింది. దీంతో ఇప్పటివరకూ లారెన్స్ సంస్థ నుంచి మొత్తం 131 హార్ట్ సర్జరీలు జరిగాయట. లారెన్స్ ఈ మానవత్వ కార్యక్రమాలకు, సమాజం కోసం ఆయన పడే తపనకు ఆయన అభిమానుల వద్ద నుంచి ఎప్పట్లానే అభినందనలు వెల్లువెత్తాయి.

lawrence

Bookmark and Share