జీ చేతికి ‘బ్రహ్మోత్సవం’ శాటిలైట్ రైట్స్

జీ చేతికి ‘బ్రహ్మోత్సవం’ శాటిలైట్ రైట్స్

Published on Feb 9, 2016 10:15 AM IST

mahesh
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు గత సినిమా శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ అవ్వడం, అలాగే హిట్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండడం వలన బ్రహ్మోత్సవం సినిమాకి సూపర్బ్ క్రేజ్ నెలకొంది.

ఆ క్రేజ్ వలనే భారీ బిజినెస్ ఆఫర్స్ అస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ 13 కోట్లు ఆఫర్ చేసారు. అదలా ఉండాగానే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ ముగిసింది. బాగా పోటీ నెలకొన్న ఈ శాటిలైట్ రైట్స్ ఫైనల్ గా జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక ప్రైజ్ కి శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. మహేష్ బాబు గత సినిమా శ్రీమంతుడు శాటిలైట్ రైట్స్ కూడా జీ తెలుగు వారే తీసుకున్నారు. మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు