మహేష్ బాబు సినిమాకి స్టార్ సినిమాటోగ్రాఫర్

మహేష్ బాబు సినిమాకి స్టార్ సినిమాటోగ్రాఫర్

Published on Nov 26, 2015 12:46 PM IST

mahesh
ఈ ఏడాది ‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్తర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరిగా చేస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. గత కొద్ది రోజులుగా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి ఉన్న మహేష్ బాబు ఈ నెల 28 నుంచి బ్రహ్మోత్సవం న్యూ షెడ్యూల్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టనున్నాడు. ఇది కాకుండా మహేష్ బాబు ఇప్పటికే తన తుపరి సినిమాని స్టార్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. మురుగదాస్ కథని పగడ్భందీగా రెడీ చేస్తూనే, సినిమాకి కావాల్సిన టెక్నీషియన్స్ ని కూడా సిద్దం చేస్తున్నారు.

తాజాగా ఎఆర్ మురుగదాస్ మహేష్ బాబు సినిమా కోసం స్టార్ సినిమాటోగ్రాఫర్ మరియు 5 సార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్న సంతోష్ శివన్ ని ఎంపిక చేసారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో ఈ విశ్యయాన్ని స్వయంగా సంతోష్ శివన్ తెలియజేశాడు. నేషనల్ అవార్డ్స్ తో పాటు హాలీవుడ్ లోని అమెరికన్ సొసైటీ అఫ్ సినిమాటోగ్రాఫర్స్ అసోషియేషన్ లో మెంబర్ షిప్ తెచ్చుకున్న మొదటి ఇండియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ కావడం విశేషం. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో అధికారికంగా లాంచ్ అయ్యి అదే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో చూట్ చేసి హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు