ప్రముఖ రచయిత సినారె కన్నుమూత !

ప్రముఖ రచయిత సినారె కన్నుమూత !

Published on Jun 12, 2017 10:00 AM IST


ప్రఖ్యాత తెలుగు రచయిత సి. నారాయణ రెడ్డి(85) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ఆయన రచనలు, తెలుగు సినిమాకి ఆయన రాసిన పాటలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. నారాయణ రెడ్డి కరీం నగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీ పేటలో జన్మించారు. ఆయనకు బాల్యం నుంచే హరికథలు, జానపథాలపై ఆసక్తి పెరిగింది.

1953లో సినారె తన తొలి రచన ‘నవ్వని పువ్వు’ రాశారు.తెలుగు సినిమాలకు ఆయన రాసిన పాటలకు ఎంతో ప్రసిద్ధి దక్కింది. 1962 లో గులేబ కావళి కథ చిత్రానికి ఆయన తొలి పాటని రాశారు. ఆ చిత్రంలో ‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని’ అనే అద్భుతమైన పాటని ఆయన రాశారు. ఇప్పటివరకు ఆయన 3500 పాటలు రాయడం విశేషం. 1988 లో ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి ప్రఖ్యాత జ్ఞాన పీఠ అవార్డుని దక్కించుకున్నారు. 1992 లో పద్మ విభూషణ్ అవార్డు ఆయన్ని వరించింది. 1997 లో సినారె రాజ్యసభ సభ్యుడిగా సైతం ఎన్నికయ్యారు. సినారె రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు