ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలమురళి కృష్ణ కన్నుమూత !
Published on Nov 22, 2016 5:56 pm IST

bala-murali-krishna

ప్రముహా సంగీత విద్వాంసుడు మంగళం బాలమురళీ కృష్ణ కొద్దిసేపటి క్రితమే చెన్నైలోని తన నివాసంలో స్వర్గస్తులయ్యారు. సంగీతం ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొన్న ఆయన భారత్ ప్రభుత్వ రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. గాయకుడిగా, స్వరకర్తగా తెలుగు, కన్నడ, తమిళం, సంస్కృతంలో ఎన్నో అద్భుతమైన పాటలను అందించారాయన.

దక్షిణాది సినీ పరిశ్రమతో కూడా అయనాకు గొప్ప అనుబంధం ఉంది. ‘పలుకే బంగారమాయన, నగుమోము’ వంటి కీర్తనలు ఆయన గొంతులోంచి జాలువారినవే. 1967 లో వచ్చిన ప్రసిద్ధ భక్తిచిత్రం ‘భక్త ప్రహల్లాద’ లో నారదుని వేషంలో కనిపించారాయన. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న చేనిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ సాయంత్రం తన ఇంట్లో కన్నుమూశారు. ఆయన మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.

 
Like us on Facebook