నేటితో ముగియనున్న రజినీ ‘లింగా’ హైదరాబాద్ షెడ్యూల్

నేటితో ముగియనున్న రజినీ ‘లింగా’ హైదరాబాద్ షెడ్యూల్

Published on Jul 30, 2014 8:31 AM IST

lingaa

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. నిన్న హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్లో రజినీకాంత్ – అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ఈ రోజు కూడా అక్కడే షూటింగ్ జరగనుంది. ఈ రోజు షూటింగ్ తో ‘లింగా’ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తవుతుంది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమా తదుపరి షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుంది.

రజినీకాంత్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ సినిమాలో ఒక పాత్రలో ఇంజనీర్ గా కనిపిస్తే, మరో పాత్రలో దొంగగా కనిపించనున్నాడు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కెఎస్ రవికుమార్ డైరెక్టర్. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు