మొదటి రోజే రికార్డ్స్ సృష్టించిన రజినీకాంత్ ‘లింగా’

మొదటి రోజే రికార్డ్స్ సృష్టించిన రజినీకాంత్ ‘లింగా’

Published on Aug 30, 2014 6:05 PM IST

lingaa
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగా’. ఈ చిత్రం లో సూపర్ స్టార్ రజినీకి జోడిగా అందాల భామలు అనుష్క శెట్టి , సోనాక్షి సిన్హా నటిస్తున్నారు, ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు k.s.రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు, క్రేజీ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత గా రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సౌత్ ఇండియా లో అత్యంత భారీగా తెరకెక్కుతోంది.

వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఈ మొదటి లుక్ మోషన్ పోస్టర్ కి మొదటి రోజునే 50 లక్షల హిట్స్ రావటం ఈ సినిమా కి మొదటి రికార్డు గా చెప్పవచ్చు. ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని దీపావళి కి రిలీజ్ చేసి సినిమా ని సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భం గా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు..ఈ సందర్భం గా చిత్ర నిర్మాత మాట్లాడుతూ “ లింగా చిత్రానికి సంభందించి మొదటి లుక్ ని ఈ వినయక చవితికి రిలీజ్ చేసాము. చూసిన ప్రతి ఒక్కరు తలైవా , సూపర్ స్టార్ రజినీకాంత్ గారి లుక్ అదిరిపోయిందని అంటున్నారు. అంతే కాకుండా ఒక్కరోజులోనే రికార్డు హిట్స్ ఇచ్చి కొత్త రికార్డుని సృష్టించారు. ఇంతటి ఆనందాన్ని మాకు , మా టీంకి ఇచ్చిన వారందరికీ మా ధన్యవాదాలు. రెహమాన్ గారు అందించిన సంగీతం దీపావళి కి విడుదల చేసి, సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్ గారి పుట్టిన రోజున విడుదల చేస్తాము” అని అన్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు