లింగ కలెక్షన్లకు ‘పికె’ గండి కొట్టనుందా?

లింగ కలెక్షన్లకు ‘పికె’ గండి కొట్టనుందా?

Published on Dec 19, 2014 1:52 AM IST

lingaa-pk
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ చిత్రం గత వారం భారీ అంచనాల నడుమ రికార్డు థియేటర్ ల సంఖ్యలో రిలీజ్ అయ్యింది. సినిమాకోసం ధారాళంగా ఖర్చుపెట్టిన నిర్మాత మొదటివారంలోనే దాదాపుగా కలెక్షన్లను వసూలు చేసుకోవడంలో సఫలీకృతమయ్యాడు.

అయితే సినిమాలో కంటెంట్ లేని కారణంగా మొదటి మూడు రోజుల తరువాత కలెక్షన్ల కౌంట్ గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు రేపు ఆమీర్ ఖాన్ ‘పికే’ కూడా విడుదలవుతుండడంతో ‘లింగ’ థియేటర్ ల సంఖ్య గణనీయంగా పడిపోనుంది.

ఒక్క హైదరాబాద్ లోనే రేపట్నుంచి లింగ సినిమా 40+ షోలకు పరిమితం కానుంది. విడుదల రోజు ఈ సంఖ్యా 150కి పై చిలుకు వుండడం గమనార్హం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు