రజినీకాంత్ ‘లింగ’ క్రిస్మస్ కి వాయిదా పడనుందా.?

రజినీకాంత్ ‘లింగ’ క్రిస్మస్ కి వాయిదా పడనుందా.?

Published on Nov 25, 2014 11:33 AM IST

lingaa-sencor
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హరోగా నటిస్తున్న సినిమా ‘లింగ’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవడమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్ర టీం రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ‘లింగ’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేసింది. కానీ మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న టైంకి పూర్తికాకపోతే ‘లింగ’ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉందని సమాచారం..

కానీ వాళ్ళు అనుకున్న టైంకే రిలీజ్ చెయ్యాలని ఎక్కువ టైం వర్క్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో సిజి ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ చిత్ర టీం అనుకున్న టైంకల్లా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫినిష్ చేసి డిసెంబర్ 12న రిలీజ్ చేస్తారా.? లేక క్రిస్మస్ రిలీజ్ కి వెళ్తారా అనేది చూడాలి..

కెఎస్ రవికుమార్ – రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరుగుతోంది. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ డైరెక్టర్. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమా అన్ని రైట్స్ ని ఇరోస్ వారు కొనుక్కున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు