పాట పూర్తి చేసిన రజినీకాంత్ – అనుష్క

పాట పూర్తి చేసిన రజినీకాంత్ – అనుష్క

Published on Jul 24, 2014 12:32 PM IST

Rajinikanth-anushka
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘లింగా’ సినిమా షూటింగ్ హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ పాటని షూట్ చెయ్యడానికి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సెట్ ని వేసారు. ఈ సెట్లో రజినీకాంత్ – అనుష్కపై ఓ పాటని షూట్ చేసారు. ఆ పాట షూటింగ్ నిన్నటితో ముగిసింది. ప్రస్తుతం షూటింగ్ కి షార్ట్ బ్రేక్ ఇచ్చిన లింగా టీం తాజా షెడ్యూల్ ని త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టనున్నారు.

రజినీకాంత్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ సినిమాలో ఒక పాత్రలో ఇంజనీర్ గా కనిపిస్తే, మరో పాత్రలో దొంగగా కనిపించనున్నాడు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కెఎస్ రవికుమార్ డైరెక్టర్. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు