‘లయన్’ రిలీజ్ డేట్ మారింది..!

‘లయన్’ రిలీజ్ డేట్ మారింది..!

Published on Apr 1, 2015 12:06 PM IST

balkrishna-lion
‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘లయన్’. సత్యదేవ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, డైలాగులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పవర్‌ఫుల్ సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న బాలయ్య యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్ అవుతుందని సమాచారం.

తాజాగా ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన సమాచారం తెలిసింది. మొదట మేడే సందర్భంగా మే ఒకటిన విడుదల చేయాలనుకున్నా ఇప్పుడు ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 30నే ఈ సినిమా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలెక్షన్లపై కన్నేసినట్టు కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారక ప్రకటన ఇంకా ఏదీ రాలేదు. రాధిక ఆఫ్టే, త్రిషలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు