లాక్ డౌన్ రివ్యూ: చింటూ కా బర్త్ డే-హిందీ ఫిల్మ్(జీ5)

లాక్ డౌన్ రివ్యూ: చింటూ కా బర్త్ డే-హిందీ ఫిల్మ్(జీ5)

Published on Jun 6, 2020 3:59 PM IST

నటీనటులు: వినయ్ పాథక్, తిల్లోటమా షోమ్, సీమా పహ్వా, బిషా చతుర్వేది, వేదాంత్ చిబ్బర్

దర్శకత్వం: దేవాన్షు కుమార్, సత్యన్షు సింగ్

నిర్మించినవారు: తన్మయ్ భట్, రోహన్ జోషి, ఆశిష్ శాక్య, గుర్సిమ్రాన్ ఖంబా

సంగీతం: నరేన్ చందవర్కర్, బెనెడిక్ట్ టేలర్

సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ దివాన్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నెక్స్ట్ ఛాయిస్ గా హిందీ ఫిల్మ్ చింటూ కా బర్త్ డే ని తీసుకోవడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

కథాంశం ఏమిటీ?

ఈ సినిమా 2004లో ఇరాక్ నేపథ్యంలో నడుస్తుంది. ఇండియాకు చెందిన ఓ కుటుంబం మంచి జీవితం కోసం ఇరాక్ వెళతారు. ఆ ఫ్యామిలీలో చిన్నవాడైన చింటూ (వేదాన్త్ చిబ్బర్) పుట్టిన రోజు ఈ సారి ఘనంగా జరపాలని చింటూ కుటుంబ సభ్యులు అనుకుంటారు. చింటూ తన స్కూల్ ఫ్రెండ్స్ ని సాయంత్రం పార్టీకి ఆహ్వానిస్తాడు. సంతోషకరమైన ఆ రోజు ఊహించని పరిణామంతో ఆ కుటుంబం ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. సంతోషంగా చింటూ బర్త్ డే జరపాలనుకున్న ఆ కుటుంబానికి ఎదురైన సమస్య ఏమిటీ? దానిని నుండి వారు ఎలా బయటపడ్డారు? ఇంతకీ చింటూ బర్త్ డే జరిగిందా? అనేదే మిగతా కధాంశం..

 

ఏమి బాగుంది?

చింటూ తండ్రి పాత్ర చేసిన సీనియర్ నటుడు వినయ్ పథక్ అవుట్ స్టాండింగ్ నటన కనబరిచాడు. కొడుకు సంతోషం కోసం తపించే తండ్రిగా, సమస్యలను తన దరికి చేరకుండా హ్యాపీగా ఉంచడానికి ఆయన చేసే ప్రయత్నాలు, నటన సినిమా చివరి వరకు ఆకట్టుకున్నాయి. సద్దాం హుస్సేన్ పతనాన్ని ఓ ఆరేళ్ళ చిన్నారి వివరించే సన్నివేశం సినిమాకే హైలెట్ అని చెప్పాలి.

అక్రమ వలస దారుల కష్టాలు, ఇరాక్ యుద్ధం సమయంలో అమెరికన్ సోల్జర్స్ అనుభవించిన ఇబ్బందులు చక్కగా చూపించారు. ఎమోషన్స్ బాగా పండాయి. బీజీఎమ్ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

 

ఏమి బాగోలేదు?

ఎటువంటి ట్విస్ట్స్ అండ్ టర్న్ లేని ఓ సాధారణ స్టోరీ ఇది. 77 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం కొంచెం నెమ్మదిగా సాగుతుంది.

 

చివరి మాటగా

చక్కని ఎమోషనల్ సన్నివేశాలతో సాగే చింటూ కా బర్త్ డే ఆద్యంతం అలరిస్తుంది. వార్ సిట్యుయేషన్ లో పిల్లల సంతోషం కోసం పేరెంట్స్ పడే తాపత్రయం కట్టిపడేస్తుంది. మొత్తంగా ఈ లాక్ డౌన్ టైం లో ఫ్యామిలీ మొత్తం కలిసి చూదగ్గ మూవీ ఇది.

Rating: 3.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు