లాక్ డౌన్ రివ్యూ : చోక్డ్ హిందీ ఫిల్మ్(నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ : చోక్డ్ హిందీ ఫిల్మ్(నెట్ ఫ్లిక్స్)

Published on Jun 5, 2020 4:50 PM IST

నటీనటులు: సైయామి ఖేర్, రోషన్ మాథ్యూ, అమృతా సుభాష్, రాజ్‌శ్రీ దేశ్‌పాండే

దర్శకత్వం: అనురాగ్ కశ్యప్

నిర్మాణ సంస్థ: మంచి బాడ్ ఫిల్మ్స్

సినిమాటోగ్రఫీ: సిల్వెస్టర్ ఫోన్సెకా

నేడు లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా హిందీ ఫిల్మ్ చోక్డ్ ఎంచుకోవడం జరిగింది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

కథాంశం ఏమిటీ?

మధ్య తరగతి గృహిణి అయిన సరిత(సయామీ ఖేర్) బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటుంది.సంపాదన లేని భర్తను కలిగిన సరిత కుటుంబ పోషణ భారం మొత్తం ఒక్కటే మోస్తూ ఉంటుంది. మధ్య తరగతి ఇల్లాలిగా అనేక బాధలుపడుతున్న సరితకు అనుకోకుండా డబ్బు వచ్చి చేరుతుంది. ఒక్కసారిగా వచ్చి పడిన సంపదతో ఆనందంగా గడుపుతున్న సరిత జీవితంలో పెద్ద నోట్ల రద్దు పిడిగుపాటులా మారుతుంది. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం చెల్లని నోట్లని తెల్సిన సరిత ఆ డబ్బును ఏమి చేసింది..?ఆ డబ్బువల్ల ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏమిటీ అనేది మిగతా కథ?

ఏమి బాగుంది?

మధ్యతరగతి మనుషుల అవసరాలు, అవి తీర్చుకోలేని నిస్సహాయత, డబ్బు కోసం వారి పరుగు వంటి విషయాలను డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అద్భుతంగా చూపించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా మధ్య తరగతి కుటుంబాలలో ఎదురైయ్యే సమస్యలను ప్రస్తావించిన విధానం బాగుంది.

ఇక గ్లామర్ రోల్స్ కి ఫేమస్ అయిన సయామీ ఖేర్ మధ్య తరగతి గృహిణిగా, డబ్బుకోసం ఆరాట పడే మహిళగా బలమైన కథలో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఈ మూవీని అన్నీ తానై నడిపించారు.

దర్శకుడు అనురాగ్ కశ్యప్ చాలా కాలం తరువాత మంచి డ్రామా, ట్విస్ట్స్ అండ్ ఎమోషన్స్ తో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడదగ్గ మూవీ తీశారు. కెమెరా వర్క్ అండ్ బీజీఎమ్ కట్టిపడేశాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఏమి బాగోలేదు?

నోట్ల రద్దుపై అనురాగ్ కశ్యప్ సెటైర్ కొద్దిమందికి నచ్చక పోవచ్చు. ఇక మూవీ మధ్య భాగం నెమ్మదిగాసాగుతుంది. క్లైమాక్స్ స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా ముగిస్తే ఇంకా బాగుండేది.

చివరి మాటగా

మొత్తంగా చెప్పాలంటే చోక్డ్ దర్శకుడు అనురాగ్ బెస్ట్ వర్క్ అని చెప్ప లేము కానీ డీసెంట్ డ్రామా, ఎమోషన్స్ మరియు ట్విస్ట్స్ తో చాల వరకు మంచి అనుభూతిని పంచుతుంది. లాక్ డౌన్ టైం లో ఓ సారి చూడదగ్గ చిత్రమే.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు