లాక్ డౌన్ రివ్యూ: ఇల్లీగల్ హిందీ వెబ్ సిరీస్(వూట్)

లాక్ డౌన్ రివ్యూ: ఇల్లీగల్ హిందీ వెబ్ సిరీస్(వూట్)

Published on Jun 4, 2020 2:40 PM IST

నటీనటులు : నేహా శర్మ, పియూష్ మిశ్రా, అక్షయ్ ఒబెరాయ్

దర్శకుడు: సాహిర్ రాజా

డి ఓ పి : సమీర్ ఆర్య

సృజనాత్మక నిర్మాత: సమర్ ఖాన్

మన లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నెక్స్ట్ ఛాయిస్ గా హిందీ వెబ్ సిరీస్ ఇల్లీగల్ ని ఎంచుకోవడం జరిగింది. వూట్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

ఢిల్లీ లోనే పేరుమోసిన క్రిమినల్ లాయర్స్ లో ఒకరైన జనార్దన్ జైట్లీ(పీయూష్ మిశ్రా) ఓ లా ఫర్మ్ నడుపుతూ ఉంటారు. మరణ శిక్ష పడిన కుబ్రా సేథ్ కేసును వాదించడానికి జనార్దన్ యంగ్ టాలెంటెడ్ లేడీ లాయర్ నిహారిక సింగ్(నేహా శర్మ)ని నియమించుకుంటారు. ఈ కేసుతో పాటు సెక్స్ వల్ హరాస్మెంట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సంస్థ కేసును కూడా వాదించే బాధ్యత నిహారిక సింగ్ కి దక్కుతుంది. మరి అత్యంత క్లిస్టమైన ఈ రెండు కేసులను వాదించే క్రమంలో నిహారిక ఎదుర్కొన్న సమస్యలు ఏమిటీ? చివరకు ఈ కేసులను వాదించి గెలిచిందా లేదా అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

సాధారణంగా గ్లామర్ రోల్స్ చేసే నిహారిక పంథా మార్చి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసింది. కోర్ట్ రూమ్ సన్నివేశాలలో ఆమె నటన మెప్పిస్తుంది. శిక్ష పడిన ముద్దాయిగా కుబ్రా సైత్ నటన మెప్పిస్తుంది.

విలన్ రోల్ చేసిన పీయూష్ మిశ్రా నటన సిరీస్ కి ప్రధాన ఆకర్షణ. కేసులో విచారణ మరియు వాదనలలో వెలుగు చూసే ట్విస్ట్స్ అలరిస్తాయి. అప్పట్లో దేశాన్ని ఊపేసిన మీ టూ వంటి విషయాన్ని చెప్పిన తీరు బాగుంది. బీజీఎమ్ అలాగే నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

 

ఏమి బాగోలేదు?

స్లోగా మొదలైన సిరీస్ లో ప్రారంభములోనే వచ్చే అనేక పాత్రలు కొంచెం గందర గోళానికి గురి చేస్తాయి. సిరీస్ ని 5-6 ఎపిసోడ్స్ లో ముగిస్తే మంచి అనుభూతి కలిగేది, పది ఎపిసోడ్స్ సాగిన ఈ సిరీస్ సాగదీతకు గురైన భావన కలుగుతుంది. రైటింగ్ అంతగా ఆకట్టుకోదు, అలాగే కొన్ని సన్నివేశాలలో లాజిక్ అసలు ఫాలో కాలేదు.

 

చివరి మాటగా

కొంచెం సాగదీత ధోరణిలో సాగినప్పటికీ కేసులు ఛేదించే క్రమంలో వచ్చే అలరించే ట్విస్ట్స్, ప్రధాన పాత్రలు చేసిన నేహా శర్మ, పీయూష్ మిశ్రా నటన ప్రధాన ఆకర్షణ. డీసెంట్ గా అనిపించే ఈ వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి మంచి అనుభూతినే పంచుతుంది.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు