‘పవర్’ కోసం బ్యాంకాక్ లో రవితేజ భారి చేజ్..!

‘పవర్’ కోసం బ్యాంకాక్ లో రవితేజ భారి చేజ్..!

Published on Jul 22, 2014 10:20 AM IST

Power_raviteja1
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా సినిమా ‘పవర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. 10 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో భారి చేజ్ షూట్ చేయనున్నారు. విదేశాలలో ఆంధ్రా పోలీస్ ‘పవర్’ తెలిపేలా విలన్స్ తో పోరాడుతున్నాడు రవితేజ. ఇటివలే బల్గేరియాలో పాటలను చిత్రీకరించారు.

రవితేజ సరసన హన్సిక, రెజినా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పవర్’ సినిమా అభిమానులకు విందు భోజనంలా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ను రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు