‘పటాస్’ కలెక్షన్స్ కి లాంగ్ వీకెండ్ ధమాఖా

‘పటాస్’ కలెక్షన్స్ కి లాంగ్ వీకెండ్ ధమాఖా

Published on Jan 25, 2015 3:57 PM IST

patas2
నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘పటాస్’. ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో నందమూరి అభిమానులు, సినీ అభిమానులు ఈ సినిమా కోసం థియేటర్స్ దగ్గర బారులు తీసారు. అంతే కాకుండా మొదటి రోజుల్లో ఈ సినిమాకి అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడమే కాకుండా థియేటర్స్ ని కూడా పెంచారు. ఇదిలా ఉంటే సోమవారం రిపబ్లిక్ డే కారణంగా గవర్నమెంట్ హాలిడే కావడం వలన లాంగ్ వీకెండ్ వచ్చింది. దాంతో సోమవారం కూడా కలెక్షన్స్ ఇదే రేంజ్ లో కొనసాగుతాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి వారం రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదవుతాయని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా పాజిటివ్ టాక్ తో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అనిల్ రావిపూడి కూడా మంచి పేరు వచ్చింది. శృతి సోది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు