ఎన్టీఆర్ కెరీర్‌లో బెస్ట్ లుక్.. ‘టెంపర్’..!

ఎన్టీఆర్ కెరీర్‌లో బెస్ట్ లుక్.. ‘టెంపర్’..!

Published on Nov 27, 2014 6:36 PM IST

Temper-(2)
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా ఫస్ట్ లుక్ స్టిల్స్ ను అధికారికంగా నేడు విడుదల చేశారు. విడుదలైన కొద్ది క్షణాలలో ఈ స్టిల్స్ కి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ చేతిలో గన్, వెనుక పోలీస్ వెహికల్.. ఇక ఎన్టీఆర్ కళ్ళలో యాంగ్రీ లుక్ ని మాటల్లో వర్ణించలేం. లీకయిన స్టిల్స్ చూసి సంబరపడిన అభిమానులకు అఫీషియల్ స్టిల్స్ తో పూరి ‘టెంపర్’ ఎక్కించారు. ఎక్కడ చూసిన ఈ స్టిల్స్ గురించే చర్చ.

ప్రతి సినిమాలో హీరోలకు బెస్ట్ క్యారేక్టరైజేషన్, సూపర్ స్టైలిష్ లుక్ డిజైన్ చేసే పూరి ‘టెంపర్’లో రెచ్చిపోయాడు. ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే బెస్ట్ లుక్ అని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. యాంగ్రీ యంగ్ మాన్ అనే పదానికి సిసలైన నిర్వచనంలా 6 ప్యాక్, షార్ట్‌ హెయిర్‌ కట్‌, స్టైలిష్ వాక్ వెరసి గతంలో చూడని కొత్త ఎన్టీఆర్ ని పూరి జగన్నాధ్ ఆవిష్కరించారు.

డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పూరి జగన్ పెన్ నుండి వెలువడిన బుల్లెట్ లాంటి డైలాగులను ఎన్టీఆర్ చెప్తే చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. బండ్ల గణేష్ నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు