లవ్, హర్రర్, కామెడీ కలయికగా ‘నేనూ సీతాదేవి’

లవ్, హర్రర్, కామెడీ కలయికగా ‘నేనూ సీతాదేవి’

Published on Oct 1, 2016 2:03 PM IST

nenu-sita-devi
యువ కథానాయకుడు సందీప్, కథానాయికలు కోమలి, భవ్య శ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘నేనూ సీతాదేవి’. శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్బంగా హీరో సందీప్ మాట్లాడుతూ ‘మంచి కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా అంటే ఉన్న తపనతో అందరం కష్టపడి ఈ చిత్రం చేశాం. ఆ కష్టాన్ని ఈ నెల 14న మీ ముందు ఉంచుతాం. మీరు ఆశీర్వదించాలి. లవ్, హర్రర్, కామెడీ అంశాల కలయికగా ఈ సినిమా రూపొందింది. మంచి నిర్మాణ విలువలు పాటించాం’ అన్నారు.

అలాగే హీరోయిన్ కోమలి మాట్లాడుతూ ‘ ఇందులో సీతాదేవిగా కనిపిస్తాను. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర. ఇందులో హర్రర్, కామెడీ, లవ్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. వినోదానికి 100 % గ్యారెంటీ’ అన్నారు. ఇకపోతే చైతన్య సంగీతం అందించిన ఈ చిత్రంలో చిత్రం శీను, ధరాజ్, వెన్నెల కిశోర్, రణధీర్ వంటి నటులు నటించారు. సునీల్ కశ్యప్ నైపత్య సంగీతం అందించిన ఈ చిత్రానికి శివాజీ. కె సినిమాటోగ్రఫీ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు