ఆగష్టు 15కి రానున్న ‘లవర్స్’.!

ఆగష్టు 15కి రానున్న ‘లవర్స్’.!

Published on Jul 30, 2014 5:09 PM IST

Lovers-(8)

‘అంతక ముందు ఆ తరువాత’ సినిమా ద్వారా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ హీరోగా, ‘ప్రేమ కథాచిత్రమ్’ తో అందరినీ ఆకట్టుకున్న నందిత హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘లవర్స్’. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 15న ఎన్.టి.ఆర్ ‘రభస’, సూర్య ‘సికంధర్’ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. మరి ఈ సినిమా వాటి పోటీని తట్టుకొని ఆగష్టు 15న రిలీజ్ అవుతుందా లేక వాయిదాపడుతుండా అనేది చూడాలి.

చిన్న సినిమాలను నిర్మించి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మారుతి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి హరినాథ్ డైరెక్టర్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ ఫ్యాన్సీ అమౌంట్ కి ఈ సినిమా నైజాం రైట్స్ ని దక్కించుకున్నారు. ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే కమెడియన్ సప్తగిరి పాత్ర సినిమాకి హైలెట్ అవుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది. సూర్యదేవర నాగ వంశీ – మహేంద్ర బాబు కలిసి నిర్మించిన ఈ సినిమాకి జెబి సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు