‘వేదం’ నాగయ్య కోసం ముందుకొచ్చిన ‘మా’

‘వేదం’ నాగయ్య కోసం ముందుకొచ్చిన ‘మా’

Published on Jul 1, 2015 9:16 AM IST

Vedam-Nagaiah
సినీ ఇండస్ట్రీలో ఆఫర్స్ ఉంటే వారి పరిస్థితి బాగుంటుంది, అదే ఆఫర్స్ లేకపోతే వారి పరిస్థితి ఎంతో విషమంగా మారుతుంది. అలాంటి సంఘటనే వేదం నాగయ్య విషయంలో జరిగింది. రీసెంట్ గా రోడ్డు మీద అడుక్కుంటూ కనపడిన వేదం నాగయ్యకి రెండు రోజుల క్రితమే తెలంగాణ ఐటి మినిస్టర్ కెటిఆర్ తెలంగాణ ప్రభుత్వ సహాయనిధి నుంచి ఆర్ధిక సహాయం అందజేశాడు. ఇప్పుడు నాగయ్యకి సాయం చేయడం కోసం ‘మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా)’ ముందుకు వచ్చింది. మా మెంబర్ మరియు సీనియర్ యాక్టర్ అయిన నరేష్ మా నాగయ్యకి సహాయం చేస్తుందని. ఆ అమౌంట్ ని జూలై మొదటి వారంలో ఆయనకు అందిస్తామని తెలిపింది.

కొద్ది రోజుల క్రితం పలువురు మీడియా వారు నాగయ్యకి ఇండస్ట్రీలో అవకాశాలు లేవు, ఆయనేమో ఫిల్మ్ నగర్ రోడ్స్ లో అడుక్కుంటూ కనిపిస్తున్నాడని తెలియజేశారు. ఇదే విషయాన్ని సినిమా ప్రేమికులు సోషల్ మీడియా ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉండే సీనియర్ నరేష్ దృష్టికి తీసుకెళ్ళారు. అలాగే ఆయనకీ హెల్ప్ చేయమని పలువురు ప్రతిపాదించారు. దాంతో నరేష్ ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా నాగయ్యకు సాయం అందించడానికి సిద్దం అయ్యారు. మాలో మెంబర్ కాని నాగయ్యకి సాయం చేయడానికి మా ముందుకు రావడం ఎంతో అభినందించదగిన విషయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు