మాధవన్ మరో తెలుగు సినిమాలో నటించనున్నాడా ?

మాధవన్ మరో తెలుగు సినిమాలో నటించనున్నాడా ?

Published on May 23, 2018 6:36 PM IST

రన్ , సఖి , యువ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు మాధవన్ .ఈయన ప్రస్తుతం స్ట్రెయిట్ గా తెలుగులో నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరొక తెలుగు సినిమాలో నటించనున్నాడని తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో హేమంత్ మధుకర్ తెరకేక్కిన్చనున్న కొత్త సినిమాలో మాధవన్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడు అని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుంది.థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో తెలియాల్సిఉంది .ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు చిత్ర యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు