వీక్ డేస్ లో సైతం సత్తా చాటుతున్న ‘మహానటి’ !

వీక్ డేస్ లో సైతం సత్తా చాటుతున్న ‘మహానటి’ !

Published on May 22, 2018 5:29 PM IST

నాగ్ అశ్విన్ తన రెండవ సినిమాగా చేసిన ‘మహానటి’ చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఆరంభంలో కొంత నెమ్మదిగానే మొదలైన ఈ వసూళ్లు వారంలోపు బాగా పుంజుకున్నాయి. ఎంతలా అంటే మొదటి వారం కన్నా ఆ తర్వాత వస్తున్న వసూళ్లే ఎక్కువగా ఉండేంతలా వృద్ధి చెందాయి కలెక్షన్స్.

ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే కేవలం సెలవు దినాల్లో మాత్రమే కాక పని దినాల్లో సైతం ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. 12వ రోజు ఆదివారం రూ.81.70 లక్షల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా సోమవారం కూడ అదే జోరు కొనసాగించి రూ. 42.3 లక్షల షేర్ ను రాబట్టి మొత్తంగా 13 రోజులకు కలిపి రూ.8.28 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. అలనాటి నటి సావిత్రిగారి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్ కు సాలిడ్ హిట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు