ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : శర్వానంద్ – సరదాగా చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమానే ‘మహానుభావుడు’ !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : శర్వానంద్ – సరదాగా చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమానే ‘మహానుభావుడు’ !

Published on Sep 26, 2017 6:21 PM IST


‘జై లవ కుశ, స్పైడర్’ వంటి భారీ చిత్రాలతో పాటే ఈ దసరా బరిలో నిలవనున్న చిత్రం ‘మహానుభావుడు’. మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 29 న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా శర్వానంద్ 123తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) సినిమా ఎలా ఉండబోతోంది ?
జ)
అతి శుభ్రత కలిగిన ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది. ఆ లక్షణం వలన అటెంలాంటి ఇబ్బందులు పడుతుంటాడు అనేదే సినిమా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మొత్తం ఒక అందమైన లవ్ స్టోరీ రూపంలో చెప్పబడింది. ఇందులో విలన్స్ లాంటి వాళ్ళెవరూ ఉండరు.

ప్ర) సినిమా ‘భలే భలే మగాడివోయ్’ తరహాలో ఉంటుందంటున్నారు. నిజమేనా ?
జ)
‘భలే భలే మగాడివోయ్’ కూడా కాన్సెప్ట్ బేస్డ్ సినిమానే కాబట్టి అలా అనుకుంటున్నారు. కానీ ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.

ప్ర) ఈ సినిమాలోని పాత్ర మీ నిజ జీవితం మీద ఏమైనా ప్రభావం చూపిందా ?
జ)
లేదు. ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆ క్యారెక్టర్ కేవలం సినిమా వరకు మాత్రమే. రియల్ లైఫ్లో సాధారంగానే ఉంటాను.

ప్ర ) యూవీ క్రియేషన్స్ లో మూడవ సినిమా చేయడం ఎలా ఉంది ?

జ) యూవీ క్రియోషన్స్ నాకు హోమ్ బ్యానర్ లాంటింది. వాళ్ళతో సినిమా చేయడం నిజంగా నా అదృష్టం. సినిమాని మంచి క్వాలిటీ తో నిర్మించారు.

ప్ర) ప్రభాస్ కు మీకు స్నేహం ఎప్పటి నుండి ?
జ)
నాకు యువీ క్రియేషన్స్ ద్వారానే ప్రభాస్ పరిచయమయ్యాడు. చాలా మంచివాడు. తక్కువ కాలంలోనే చాలా క్లోజ్ అయిపోయాడు. యువీ క్రియేషన్స్ లో నా మొదటి ‘రన్ రాజా రన్’ రిలీజప్పుడు నాకన్నా ఎక్కువ టెంక్షన్ పడ్డాడు.

ప్ర) ‘జై లవ కుశ, స్పైడర్’ మధ్య వస్తున్నారు కదా టెంక్షన్ లేదా ?
జ)
ఎలాంటి టెంక్షన్ లేదు. ఎందుకంటే ఈ మూడు డిఫరెంట్ జానర్ సినిమాలు. వేటికవే భిన్నంగా ఉంటాయి. ‘మహానుభావుడు’ కంప్లీట్ ఎంటర్టైనర్. సెలవులు కాబట్టి జనాలు కూడా డిఫరెంట్ సినిమాల్ని చూడాలనుకుంటారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందీ లేదు. మూడు సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను.

ప్ర) ఫ్యూచర్లో ఎలాంటి తరహా సినిమాలు చేయాలని ఉంటుంది ?
జ)
నాకు ‘మహానుభావుడు’ లాంటి మంచి మంచి సినిమాలు తీస్తూ ఇలాగే హ్యాపీగా గడపాలని ఉంది.

ప్ర) తమన్ తో కలసి పనిచేయడం గురించి ?
జ)
తమన్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించాడు. ముఖ్యంగా బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చాడు. పాటలు, బ్యాగ్ గ్రౌండ్ సంగీతం రెగ్యులర్ తెలుగు చిత్రం కాదని ఫీలింగ్ ని ఇస్తాయి.

ప్ర) ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తోంది ?
జ)
నా కెరీర్లో నిలిచిపోయే మంచి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా చేయడం ద్వారా రెగ్యులర్ సినిమాల నుండి నాక్కూడా కొంత రిలీజ్ దొరికినట్టు అనిపిస్తోంది.

ప్ర) మారుతిగారిలో మీరు గమనించిన ప్రత్యేక అంశం ఏంటి ?
జ)
సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉండటమంటే మాటలుకాదు. అప్పట్లో జంధ్యాల, ఈవీవీ గారు అలా చేయగలిగేవారు. ఇప్పుడు మారుతిగారు. అలా నవ్వించగలగడం కూడా ఒక వరం.

ప్ర) మల్టీ స్టారర్ సినిమాలు చేసే ఉదేశ్యమేమైనా ఉందా ?
జ)
ఉంది. దానికి తగిన కథ, దర్శకుడు నా దగ్గరకు వస్తే తప్పకుండా చేస్తాను.

ప్ర) ప్రస్తుతమున్న హీరోల్లో నాని మీకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆ పోటీ మీకెలా అనిపిస్తోంది ?
జ)
పోటీ అనేం కాదు. నాని మంచి మంచి సినిమాలు చేయాలి, అంతకు మించి నేను చేయాలి, నాకు మించి నాని చేయాలి. అలా హెల్తీ పోటీతో సినిమాలు చేసుకుంటూ వెళ్లాలనేది నా ఉద్దేశ్యం.

ప్ర) ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ?
జ)
ఈ పండుగకి కుటుంబమంతా కలిసి సరదగా చూసే సినిమా ఇది. ప్రేక్షకులు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది.

ఇంటర్వ్యూ చేసినవారు : యశ్వంత్ కుమార్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు