శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ‘మహేష్23’

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ‘మహేష్23’

Published on Jan 18, 2017 5:12 PM IST

mahesh-murgadoss-in
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. సౌతిండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్‌ ప్రస్తుతం హైద్రాబాద్‍లో జరుగుతోంది. ఇక ఈ షెడ్యూల్‌లో భాగంగా కొద్దిరోజులుగా పూర్తిగా రాత్రి వేళకు సంబంధించిన సన్నివేశాలను తీస్తున్నారట. మరికొద్ది రోజులపాటు రాత్రి వేళల్లోనే షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

జనవరి 29వరకూ హైద్రాబాద్‌లోనే షూటింగ్ జరగనుండగా, ఆ తర్వాత పూణే, ముంబైలలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఫిబ్రవరి నెలాఖర్లో విదేశాల్లో పాటల చిత్రీకరణ జరగనుంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్‍తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్ సరసన రకుల్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. మహేష్ ఈ సినిమాలో ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖర్లో ఫస్ట్‌లుక్, టైటిల్ విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు