కాస్త వెనక్కు తగ్గిన మహేష్ – కొరటాల చిత్రం !

కాస్త వెనక్కు తగ్గిన మహేష్ – కొరటాల చిత్రం !

Published on Feb 21, 2017 1:29 PM IST


మొదట అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ చేయాల్సి ఉంది. అందులో ఒకటి మురుగదాస్ చిత్రం కాగా మరొకటి కొరటాల శివ చిత్రం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అలా జరిగేలా కనబడటం లేదు. ఎందుకంటే మహేష్ ఇప్పుడు చేస్తున్న మురుగదాస్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ షూట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కంప్లీట్ చేసుకుని రిలీజుకు వెళ్లాలంటే ఇంకాస్త టైమ్ పట్టే ఛాన్స్ కనిపిస్తోంది.

ఈ ఆలస్యంతో మహేష్ నెక్స్ట్ చేయాల్సిన కొరటాల చిత్రం ఆటోమేటిక్ గా వెనుకబడి సంవత్సరం మధ్యలో మొదలవ్వాల్సిన ప్రాజెక్ట్ కొన్ని నెలలు ఆలస్యంగా ఆరంభం కానుంది. దీంతో ఏడాది ఆఖరున అనుకున్న రిలీజ్ 2018 సంక్రాంతికి లేదా జనవరి ఆఖరుకి వెళ్లనుంది. ఈ వార్తతో ఈ ఏడాది మహేష్ నుండి రెండు సినిమాలు ఆశించిన అభిమానులకు కాస్త నిరుత్సాహం తప్పదు. మరోవైపు మహేష్-23 టీమ్ మాత్రం మురుగదాస్ తెరకెక్కిస్తున్న సినిమా అభిమానుల అంచనాలను మించేలా ఉండబోతుందని మాటిస్తుండటం వారికి కాస్త సంతోషాన్ని కలిగించే విషయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు