‘భలే మంచి రోజు’ ట్రైలర్‌ను మెచ్చుకున్న మహేష్!

‘భలే మంచి రోజు’ ట్రైలర్‌ను మెచ్చుకున్న మహేష్!

Published on Nov 26, 2015 10:39 PM IST

mahesh
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్తగా సినీ పరిశ్రమకు పరిచయమైన హీరో సుధీర్ బాబు. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, రీసెంట్‌గా వచ్చిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాతో అటూ విమర్శకుల ప్రశంసలను, బాక్సాఫీస్ విజయాన్నీ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఈ హీరో, ‘భలే మంచి రోజు’ అనే సినిమాను అప్పుడే విడుదలకు సిద్ధం చేసేశారు.

కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను 70 ఎంఎం బ్యానర్‌పై విజయ్, శశి నిర్మించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. మహేష్, రానాలు ప్రత్యేక అతిథులుగా హాజరై ట్రైలర్, ఆడియోలను విడుదల చేశారు. ఇక ఈ సందర్భంగా మహేష్ దర్శకుడు శ్రీరామ్, హీరో సుధీర్‌లపై ప్రశంసలు కురిపించారు.

ఇదిలా ఉంటే.. కొద్దిసేపటి క్రితం ఇదే సినిమా గురించి మళ్ళీ మహేష్ ప్రస్తావించడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ‘భలే మంచి రోజు’ ట్రైలర్ చాలా ఫ్రెష్‌గా, ఇన్నోవేటివ్‌గా ఉందని సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని ట్రైలర్‌ను మహేష్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇక మహేష్ సపోర్ట్‌తో ఈ సినిమాకు అంతటా పాజిటివ్ క్రేజ్ వచ్చేసింది. ట్రైలర్ కూడా కొత్తగా ఆకట్టుకునేలా ఉండి ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు