‘శ్రీమంతుడు’ తమిళ వర్షన్‌కు మహేష్ డబ్బింగ్ చెప్పట్లేదు!

‘శ్రీమంతుడు’ తమిళ వర్షన్‌కు మహేష్ డబ్బింగ్ చెప్పట్లేదు!

Published on Aug 1, 2015 5:13 PM IST

Mahesh-srimantudu
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’గా ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆరు రోజులే ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే! తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు తమిళంలో ‘సెల్వందన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తమిళ నాట, ముఖ్యంగా చెన్నైలో మహేష్‌కు మొదట్నుంచీ మంచి పాపులారిటీ ఉంది.

ఆ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొనే, గతంలో మహేష్ నటించిన కొన్ని సినిమాలు తమిళంలోనూ డబ్ అయ్యాయ్! అయితే ఆ సినిమాలేవీ నేరుగా తెలుగు వర్షన్ రోజే విడుదలవ్వలేదు. శీమంతుడు విషయంలో మాత్రం తమిళ వర్షన్ కూడా ఒకేసారి పెద్దఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు తమిళంలో ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఆగష్టు 4న చెన్నైలో సెల్వందన్ ఆడియో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తమిళ వర్షన్‌కు కూడా మహేష్ స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారన్న ప్రచారం జరిగింది.

తాజాగా తమిళ వర్షన్‌కు డబ్బింగ్ చెప్పడం విషయమై మహేష్ ఓ క్లారిటీ ఇచ్చారు. శ్రీమంతుడు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణంగా తమిళ వర్షన్ డబ్బింగ్ చెప్పలేకపోతున్నానని, యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ సినిమా అక్కడి ప్రేక్షకులనూ బాగా ఆకట్టుకుంటుందని మహేష్ తెలిపారు. మైత్రీ మూవీస్ సంస్థతో కలిసి మహేష్ నిర్మాణంలో కూడా పాల్పొంచుకొని రూపొందించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు