మరోసారి 6 ప్యాక్ చూపించడానికి నిరాకరించిన మహేష్ బాబు

మరోసారి 6 ప్యాక్ చూపించడానికి నిరాకరించిన మహేష్ బాబు

Published on Dec 19, 2014 1:24 PM IST

Mahesh
‘1 నేనొక్కడినే’ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు 6 ప్యాక్ చేశారు. తమ ఫేవరెట్ హీరోను 6 ప్యాక్ లో చూద్దామని ఆశపడిన అభిమానులకు నిరాశే ఎదురయింది. మహేష్ కు కాస్త సిగ్గు ఎక్కువ. దాంతో 6 ప్యాక్ చేసినా సిల్వర్ స్క్రీన్ పై చూపలేదు.

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం ఓ యాక్షన్ సన్నివేశంలో మహేష్ బాబును 6 ప్యాక్ చూపించాల్సిందిగా దర్శకుడు కోరారు. మహేష్ సున్నితంగా దర్శకుడి కోరికను తిరస్కరించారు. దాంతో అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. మహేష్ బాబు 6 ప్యాక్ చూసే అదృష్టం అభిమానులకు లేదని అర్ధమైంది.

ఈ సినిమాలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రి మూవీస్ పతాకంపై రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు