మహేష్ బాబు దాన గుణం.!

మహేష్ బాబు దాన గుణం.!

Published on Apr 21, 2015 6:18 PM IST

mahesh_babu4
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న లీడింగ్ స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు మాట ఎంత పొదుపుగా ఉంటుందో అంతే సీక్రెట్ ఆయన మంచి పనులు చేసేస్తుంటారు. మహేష్ బాబు సినిమాలు కాకుండా తను చేసే ఎండోర్స్ మెంట్స్ ద్వారా వచ్చే మోనే మొత్తాన్ని చారిటీలకి ఇస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. చారిటబుల్ ఈవెంట్స్ కోసం కూడా మహేష్ తన వంతు సాయం చేస్తుంటాడు. లేటెస్ట్ గా మహేష్ బాబు ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్ గా ‘హీల్ ఎ చైల్డ్’ అనే ఫౌండేషన్ కి 1.5 కోట్ల రూపాయలను డొనేట్ చేసాడు. ఈ ఫౌండేషన్ డొనేషన్స్ కలెక్ట్ చేసి మెడికల్ గా ట్రీట్మెంట్ చేసుకోలేక బాధపడుతున్న పిల్లలకి ట్రీట్ మెంట్ చేయిస్తుంది.

ఈ ఫౌండేషన్ కి ఇచ్చిన డబ్బు కూడా అమహేష్ బాబ్బు ఓ ఈవెంట్ కి అటెండ్ అవ్వడానికి తీసుకున్న మొత్తమం నుంచే ఇచ్చారు. ఇటీవలే మహేష్ బాబు యుఎస్ టాన మహాసభలకు అటెండ్ అవుతానని ఓ భారీ మొత్తం తీసుకున్నారు. అందులో నుంచే ఈ 1.5 కోట్ల రూపాయలను హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్ కి ఇచ్చారు. మహేష్ బాబు లాంటి హీరో ఇంత దాన గుణంతో చేసిన ఈ మంచి పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. మహేష్ ఆబు ప్రస్తుతం కొరటాల శివ శ్రీ మంతుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూలై 17న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు