ఇంటర్వ్యూ : మంజుల ఘట్టమనేని – నా మాటలు విని మహేష్ షాక్ అయ్యాడు !

ఇంటర్వ్యూ : మంజుల ఘట్టమనేని – నా మాటలు విని మహేష్ షాక్ అయ్యాడు !

Published on Feb 12, 2018 1:12 PM IST

మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో సందీప్ కిషన్, అమైరా దస్తూర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమా ‘మనసుకు నచ్చింది’. ఈ నెల 16న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా మంజుల మీడియతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీ సినిమా గురించి చెప్పండి ?
జ) ఈ సినిమాను నేను ఏదో ఒకటి తీయాలని చేయలేదు. మనసు పెట్టి చేశాను. నా మనసులో ఉన్నది చెప్పాలనే తీశాను. ఇదొక జన్యూన్ ఎఫర్ట్.

ప్ర) సినిమా కథేమిటి ?
జ) ఈ సినిమాలో మంచి ప్రేమ కథ, ఫన్ ఉంటాయి. వాటితో పాటే అసలు జీవితంలో మనం చిన్న చిన్న అనుభూతుల్ని ఎలా కోల్పోతున్నాం, వాటిని ఎలా ఆస్వాదించాలి, ప్రకృతితో ఎలా మమేకం కావలి అనేదే కథ.

ప్ర) ఈ సినిమాలో హైలెట్ గా నిలిచే అంశాలు ?
జ) నా సినిమాలో ప్రకృతే ప్రధాన హైలెట్. అది కూడా ఒక హీరోనే. ఇందులోని స్వచ్ఛమైన ప్రేమ కథ, ఫన్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘మనసుకు నచ్చింది’ ఒక సముద్రం లాంటి సినిమా.

ప్ర) ఈ సినిమా మీద ఎన్నాళ్ళు వర్క్ చేశారు ?
జ) స్క్రిప్ట్ రాయడానికి నాకు సంవత్సరం పట్టింది. ఆ తర్వాత సాయి మాధవ్ బుర్రాగారితో కూర్చుని డైలాగ్స్ తయారుచేసుకోవడానికి 6 నెలలు పట్టింది.

ప్ర) ఈ సినిమాని సందీప్ కిషన్ కోసమే తయారుచేశారా ?
జ) లేదు. మొదటి కథ రాసుకున్నాను. ఆ తర్వాత కొంతమందికి చెప్పాను. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత సందీప్ కిషన్ దగ్గరకు వెళ్ళాను. మొదటి మీటింగ్లోనే అతనే నా సినిమాకి తగిన హీరో అనిపించింది.

ప్ర) డైరెక్షన్ చేస్తాను అనగానే మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి ?
జ) నా భర్త వెంటనే సపోర్ట్ చేశారు. నాన్న అయితే చెప్పగానే చాలా సప్రైజ్ అయ్యారు. ఇక బయటి నిర్మాతలు ప్రొడ్యూజ్ చేస్తున్నారు అనగానే ఇంకా థ్రిల్ అయి ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అన్నారు.

ప్ర) మరి మీ సోదరుడు మహేష్ బాబు ఏమన్నారు ?
జ) మహేష్ నేను సినిమా డైరెక్ట్ చేద్దామనుకుంటున్నాను అనగానే.. షాక్ అయ్యాడు. డైరెక్ష అంటే ఈజీ కాదు అన్నాడు. కానీ నా కథ విని, పట్టుదల చూసి ఎంకరేజ్ చేశాడు.

ప్ర) మరి ఆయనతో సినిమా ఎప్పుడు చేస్తున్నారు ?
జ) నాకు చేయాలనే ఉంది. అతనిలాంటి హీరోతో సినిమా చేయడం అందరికీ ఒక కల లాంటిది. కానీ టైమ్ రావాలి. మహేష్ పిలిచి సినిమా చేద్దాం అంటే వెంటనే చేస్తాను.

ప్ర) మరి పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీగా ఉందన్నారు. దాని సంగతేమిటి ?
జ) అవును. కథ సిద్ధంగా ఉంది. ఒక టాప్ హీరో అన్నిటినీ వదిలేసి జనాలకు సేవ చేద్దామనుకొని రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాడు అనే అంశం మీదే సినిమా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారే ఆ సినిమాకు సరైన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టే సినిమా ఉంటుంది.

ప్ర) ఫైనల్ గా ‘మనసుకు నచ్చింది’ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ?
జ) ఈ సినిమా యువతకు ఒక పండుగ లాంటిది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు