డార్లింగ్ కు మహేష్ సూపర్ స్పెషల్ విషెష్.!

డార్లింగ్ కు మహేష్ సూపర్ స్పెషల్ విషెష్.!

Published on Oct 23, 2020 12:17 PM IST

ఈరోజు మన డార్లింగ్ హీరో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో రెబల్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ట్రెండ్ తో హోరెత్తిస్తుండగా ప్రభాస్ కు విషెష్ చెబుతూ దేశ వ్యాప్తంగా ఉన్న ఎందరో అగ్ర తారలు విషెష్ తెలుపుతున్నారు.

అయితే ఇప్పుడు డార్లింగ్ కు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రత్యేక శుభాకాంక్షలు వ్యక్తపరిచారు. ప్రభాస్ కు హ్యాపీ బర్త్ డే చెబుతూ నీ అపారమైన విజయాన్ని మరింత కోరుకుంటున్నాని సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మహేష్ తన విషెష్ ను ప్రభాస్ కు తెలిపారు.

ఇలా మహేష్ నుంచి ప్రభాస్ కు విషెష్ రావడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఒకరి పట్ల మరోకరు సోషల్ మీడియాలో తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ స్టార్ కు విష్ చేసిన మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట ను కూడా పాన్ ఇండియన్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుండగా వచ్చే నవంబర్ లో ఈ చిత్రం షూట్ మొదలు కానుంది.

https://www.instagram.com/p/CGrJlgwnLcP/?utm_source=ig_web_copy_link

సంబంధిత సమాచారం

తాజా వార్తలు