క్రేజీ డైరెక్టర్స్ తో మహేష్ బాబు..!

క్రేజీ డైరెక్టర్స్ తో మహేష్ బాబు..!

Published on Oct 20, 2014 8:00 PM IST

Mahesh_babu1
కొరటాల శివ, పూరి జగన్నాధ్, శ్రీకాంత్ అడ్డాల.. సూపర్ స్టార్ మహేష్ బాబును సరికొత్తగా చూపించబోయే దర్శకుల లిస్టు ఇది. ఇప్పటికే మహేష్ బాబు, కొరటాల శివ సినిమా షూటింగ్ ప్రారంభమయింది. ఈ కాంబినేషన్ అభిమానులలో ఆసక్తి రేపుతుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే పూరి జగన్నాధ్ సినిమా, తర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా మొదలవుతుందని సమాచారం. ఈ దర్శకులు ఇద్దరూ గతంలో మహేష్ ని కొత్తగా చూపించారు. ఆయా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాయి. సో, వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే కన్ఫర్మ్ హిట్ అని అభిమానులు ఆశిస్తున్నారు. మరికొందరు దర్శకులు కూడా మహేష్ బాబుతో సినిమాలు చేయడానికి వెయిటింగ్ లో ఉన్నారని సమాచారం.

మహేష్ బాబు నటించిన గత రెండు సినిమాలు ఆశించిన రీతిలో విజయం సాదించలేదు. అభిమానులకు ఆ సినిమాలు నచ్చినా ఎక్కడో చిన్న అసంతృప్తి. ఇది గమనించిన మహేష్ బాబు, తదుపరి సినిమాలపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు