నాని సినిమాకి మహేష్ బాబు సోదరి దర్శకత్వం…?

నాని సినిమాకి మహేష్ బాబు సోదరి దర్శకత్వం…?

Published on May 31, 2016 8:23 AM IST

manjula
నటిగా, నిర్మాతగా మంచి పేరుతెచ్చుకున్న మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పుడు మరో రంగంలోకి అడుగెడుతున్నారు. ఇప్పటివరకూ నటిగా ‘షో’, ‘కావ్యాస్‌ డైరీ’ లాంటి చిత్రాల్లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. అంతేకాకుండా మహేష్‌ కథానాయకుడిగా నటించిన ‘నాని’, ‘పోకిరి’తో పాటు ‘షో’, ‘కావ్యాస్‌ డైరీ’, ‘ఏమాయ చేసావె’ తదితర చిత్రాల్ని నిర్మించారు మంజుల.

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తన దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మంజుల సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ’ఉయ్యాల జంపాలా’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత మంజుల దర్శకత్వంలో సినిమా మొదలవచ్చని సమాచారం. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు