కన్ఫ్యూషన్ లో మహేష్ ఫ్యాన్స్.. !

కన్ఫ్యూషన్ లో మహేష్ ఫ్యాన్స్.. !

Published on Feb 23, 2020 11:00 PM IST

మహేష్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇచ్చాడు. ఇంకొద్ది నెలలలో కొత్త సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తాడు అనుకుంటున్న తరుణంలో క్యాన్సిల్ చేసి కన్ఫ్యూషన్ లోకి నెట్టారు. ఆయన తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి తో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గత రెండు రోజులుగా ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అటు మహేష్ కానీ, ఇటు వంశీ కానీ స్పందించక పోవడంతో వార్త నిజమే అని అనిపిస్తుంది.

ఐతే ఈ పరిస్థితి ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ని ఇరుకున పెట్టింది. అసలు మహేష్ సినిమా వంశీ తోనా లేదా వేరే దర్శకుడితో ఉంటుందా? అసలు మహేష్ నెక్స్ట్ మూవీ ఇప్పట్లో మొదలు అవుతుందా.. లేదా? అనే అనుమానం వారిలో పెరిగిపోయింది. మరో ప్రక్క మహేష్ ఓ కొత్త దర్శకుణ్ణి ట్రై చేస్తారని కొందరు ఫ్యాన్స్ ఆగిపోవడం బెటరే అని ఆనంద పడుతున్నారు. ఇలా తాజా పరిణామం మహేష్ ఫ్యాన్స్ భిన్న ఎమోషన్స్ లోకి నెట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు