మహేష్ ప్రేమ కథ రాయమని అడిగాడట !

మహేష్ ప్రేమ కథ రాయమని అడిగాడట !

Published on May 27, 2017 2:15 PM IST


సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాన్జీ టాలీవుడ్ లో దాదాపుగా బడా హీరోలందరితో సినిమాలు తీశారు. పవన్, మహేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్ వంటి హీరోలతో ఆయన సినిమాలు తీశారు. కాగా గత కొన్నేళ్లుగా ఆయన కెరీర్ డల్ గా సాగుతోంది.

ప్రస్తుతం జయంత్ కొత్త హీరో గంట రవితేజతో జయదేవ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. జయంత్ మీడియా తో మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ ప్రస్తావన తీసుకుని వచ్చారు. మహేష్ తో ఆయన టక్కరి దొంగ చిత్రాన్ని తీశారు. మహేష్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని తెలిపాడు. చాలా రోజుల క్రితం తనకోసం ఓ ప్రేమ కథ రాయమని అడిగాడని జయంత్ తెలిపాడు. కానీ తాను మహేష్ కోసం ఓ మంచి కథ రాయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు