హైదరాబాద్లో మహేష్ – కొరటాల మూవీ ఫస్ట్ షెడ్యూల్.

హైదరాబాద్లో మహేష్ – కొరటాల మూవీ ఫస్ట్ షెడ్యూల్.

Published on Aug 23, 2014 2:33 PM IST

Koratala-shiva-mahesh-babu

‘ఆగడు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కబోయే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. హైదరాబాద్ లో షూటింగ్ పూర్తయిన తర్వాత మూవీ యూనిట్ బ్యాంకాక్ వెళ్లనున్నారు. అక్కడ రెండవ షెడ్యూల్ జరుగుతుంది.

మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు