పొల్లాచ్చిలో మహేష్ బాబు – కొరటాల శివ సినిమా షూటింగ్.

పొల్లాచ్చిలో మహేష్ బాబు – కొరటాల శివ సినిమా షూటింగ్.

Published on Jan 29, 2015 5:22 PM IST

Mahesh-Babu-Koratala-Shiva

‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ వంటి వరుస పరాజయాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా షెడ్యూల్ పొల్లాచ్చిలో జరుగుతుందని సమాచారం. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రచయిత నుండి దర్శకుడిగా మారి, ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కొరటాల శివ.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారంలో ఉంది. కానీ, నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు.

మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పూర్ణ ప్రత్యేక గీతంలో నటిస్తుంది. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు