పర్సనల్ లైఫ్ గురించి మహేష్ కామెంట్స్

పర్సనల్ లైఫ్ గురించి మహేష్ కామెంట్స్

Published on Nov 29, 2015 12:26 PM IST

mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సింపుల్ గా, చాలా రిజర్వ్డ్ గా ఉండే వ్యక్తి, హీరోగా కూడా ఆటను మీడియాతో ఓపెన్ గా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. కానీ రీసెంట్ గా వచ్చిన శ్రీమంతుడు సినిమాతో అవన్నే బద్దలు కొట్టేసి ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి భారీ ఎత్తున మహేష్ బాబు ప్రమోషన్స్ చేసాడు. అలాగే ప్రస్తుతం మహేష్ బాబు తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా ఓపెన్ గా మీడియాతో షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ తన ఫ్యామిలీ లైఫ్ గురించి పంచుకున్నాడు..

‘సింపుల్ గా ఉండడం, స్టార్ అనే విషయాన్ని ఇంటి బయటే వదిలేసి మహేష్ లా ఇంట్లో ఉండడం మా నాన్నగారు(కృష్ణ)నుంచే నేర్చుకున్నాను. అలాగే నేను నా 10ఏళ్ళ వివాహ బంధాలో నమ్రతకి ఓ మంచి భర్తలా ఉన్నాను. చాలా మంది తమ భార్యలతో సరిగా ఉండరు. ఎవరైతే భార్యలకి నమ్మకమైన భర్తల్లా ఉండరో వాళ్ళు ఫూలిష్ పర్సన్స్ అని అంటాను. నా మారేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గౌతమ్, సితార వచ్చాక చాలా చాలా బాగుంది.అలాగే నేనప్పుడు అన్నయ్య రమేష్బాబు, సిస్టర్ ఇందిరలతో చాలా ఆప్యాయంగా ఉంటానని’ మహేష్ బాబు తెలిపాడు. మహేష్ బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు