రాజమౌళితో సినిమాను కన్ఫర్మ్ చేసిన మహేష్ !


దాదాపు అందరు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో ఇప్పటికి ఒకసారి కూడా పనిచేయలేదు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో, ఎంత పెద్ద హిట్టవుతుందో చూడాలని అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా మహేష్ తో పనిచేయాలని ఉందని పలుసార్లు మనసులో మాటను బయటపెట్టారు. ఎట్టకేలకు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది.

తాజాగా ‘స్పైడర్’ విడుదలకు సంబంధించి జరిగిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఈ వార్తను ఖాయం చేశారు. 2018 ఆఖరుకు సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ‘స్పైడర్’ విడుదల పనుల్లో ఉన్న మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. 2018 వేసవికి ఈ సినిమా పూర్తికానుంది. దాని తర్వాత వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అది కూడా ముగిసి రాజమౌళి చిత్రం పట్టాలెక్కడానికి 2018 ఆఖరు పడుతుంది.

 

Like us on Facebook