బాహుబలి 2 పై సూపర్ స్టార్ మాట ఇదే..!

బాహుబలి 2 పై సూపర్ స్టార్ మాట ఇదే..!

Published on Apr 29, 2017 5:36 PM IST


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రాజమౌళి బాహుబలి 2 చిత్రానికి వరుసగా ప్రముఖుల నుంచి అభినందనలు వస్తున్నాయి.తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బాహుబలి 2 చిత్రాన్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. బాహుబలి 2 సినిమా చూశాక మహేష్ తాన్ అభిప్రాయాన్ని తెలియజేసాడు. బాహుబలి 2 చిత్రం అంచనాలకు మించి ఉందని కితాబిచ్చాడు. బాహుబలి 2 పై మహేష్ ట్విట్టర్ లో స్పందించాడు.

రాజమౌళితోపాటు బాహుబలి చిత్ర యూనిట్ కి మహేష్ శుభాంక్షలు తెలిపాడు. కాగా బాహుబలి 1 చిత్రం బాగా ఆడాలని గతంలో మహేష్ తన శ్రీమంతుడు చిత్ర విడుదలని నెల పాటు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.కాగా శుక్రవారం విడుదలైన బాహుబలి 2 చిత్రం కలెక్షన్లలో జాతీయ స్థాయి లోనే సంచలనాలు సృష్టిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు