ఇకపై ప్రయోగాలు చేసేది లేదంటున్న మహేష్ బాబు !

ఇకపై ప్రయోగాలు చేసేది లేదంటున్న మహేష్ బాబు !

Published on Apr 19, 2018 1:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హాలీడే నుండి తిరిగిరావడంతోనే ‘భరత్ అనే నేను’ ప్రమోషన్లలో పాల్గొనడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన చాలా విశేషాల్ని, విషయాల్ని పంచుకున్నారు. రీమేక్ సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదన్నా మహేష్ మళ్ళీ ప్రయోగాలు చేస్తారా అనే ప్రశ్నకు ‘ఇకపై ప్రమోగాలు చేయను. చేస్తే నాన్నగారి ఇంటికొచ్చి కొట్టేలా ఉన్నారు’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు.

గతంలో మహేష్ ‘టక్కరి దొంగ, ఖలేజా, వన్ నెన్నొక్కడినే, నాని’ వంటి సినిమాలతో ప్రయోగాత్మక సినిమాల పట్ల తన అభిరుచిని చాటుకున్న మహేష్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 20న విడుదలకానున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాతో మహేష్, కొరటాల శివలు తమ గత చిత్రం ‘శ్రీమంతుడు’ కలెక్షన్ల రికార్డుల్ని బ్రేక్ చేస్తారని అందరూ భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు